ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను: కోడెల శివరామ్

  • విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన కోడెల కొడుకు
  • గన్నవరం విమానాశ్రయం చేరుకున్న శివరామ్ 
  • తండ్రిని కోల్పోయిన శివరామ్ కు ఓదార్పు
విదేశీ పర్యటనలో ఉన్న కోడెల తనయుడు శివరామ్ కొద్ది సేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. టీడీపీ నేతలు ఆయన్ని ఓదార్చారు. అక్కడి నుంచి నరసరావుపేటకు శివరామ్ బయలుదేరారు. ఈ సందర్భంగా పలకరించిన మీడియాతో ఆయన మాట్లాడుతూ, ‘మా కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ పరిస్థితుల్లో నేనేమీ మాట్లాడలేను' అన్నారు. కాగా, కోడెల పార్థివదేహం తరలింపు ప్రక్రియ వర్షం మధ్యే కొనసాగుతోంది. నందిగామలో జోరువానలోనూ కోడెల పార్థివదేహానికి టీడీపీ నేతలు నివాళులర్పించారు.
Go Back to Shorts
Kodela siva prasad
Sivaram
Gannavaram

More Telugu News